http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 20 August 2015

On 22:27 by Unknown   No comments
అఖిల్‌ సినిమా సిద్ధం
           అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్‌ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. ఈనెల 22 నాటికి 3 పాటలు మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత నితిన్‌ మాట్లాడుతూ ''ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మిగిలిన మూడు పాటలను భారీగా ప్లాన్‌ చేశాం. ఈనెల 29 నాగార్జున పుట్టిన రోజున ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేస్తాం. నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 20న ఆడియో ఫంక్షన్‌ నిర్వహిస్తాం. అక్టోబర్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా విజయదశమి కానుకగా 100 పర్సెంట్‌ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం'' అన్నారు. అఖిల్‌ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, మహేష్‌ మంజ్రేకర్‌, సప్తగిరి, హేమలతో పాటు లండన్‌కు చెందిన లెబాగా జీన్‌, లూయిస్‌ పాస్కల్‌, ముతినే కెల్లున్‌ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్‌ బైరన్‌ జేమ్స్‌ విలన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్‌, కోన వెంకట్‌, అనూప్‌, థమన్‌, అమోల్‌ రాథోడ్‌, రవివర్మ, ఎ.ఎస్‌.ప్రకాష్‌, గౌతంరాజు, భాస్కరభట్ల, కృష్ణచైతన్య, శేఖర్‌, గణేష్‌, జాని సాంకేతిక నిపుణులు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం(వెంకట్‌), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov