http://www.propellerads.com/?rfd=TwUb

info

Thursday, 20 July 2017

On 12:08 by Unknown   No comments
మృతిపై అనుమానాలుఅస్సామీ, హిందీ సినిమాల్లో నటి, గాయనిగా రాణిస్తోన్న బిదిశా బెజ్బరువా ఆత్మ ఆత్మహత్యకు సంబంధించి తాజాగా పలు విషయాలు వెలుగుచూశాయి. ఆమె అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరివేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కేసు విషయం లో కొత్త మలుపు బాలీవుడ్ లో కూడా చర్చనీయాంశం అయ్యింది.
జగ్గా జాసూస్ అసామీ నటిగా పాపులర్‌అయిన బిదిశా.. ఇటీవలే ‘జగ్గా జాసూస్' ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సోమవారం ఢిల్లీ శివారుగురుగావ్‌ లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరివేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతిపై అనుమానాలు ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బిదిశా స్వస్థలం అస్సాంలోని గౌహతి. బిదిశాకు నటనతో పాటు సంగీతంలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. టీనేజ్ లో ఉండగానే అసామీ నాటకాలు ,సంగీత కార్యక్రమాలతో ఆమెకు మంచి పేరొచ్చింది. నితీష్ ఝా అయితే ఆమె ఆత్మ ఆత్మహత్యకు సంబంధించి తాజాగా పలు విషయాలు వెలుగుచూశాయి. ఏడాది కిందే గుజరాత్‌కు చెందిన నితీష్ ఝా అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. అయితే నిశీత్ కుటుంబీకులు బిదిశను వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆత్మహత్యకు ముందే భర్తతో మాత్రం ఆమె మంచి సంబంధాలను కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల ముందే ఆమె భర్తతో కలిసి టూర్‌కు వెళ్ళింది. కానీ ఇద్దరి మధ్యా సఖ్యత మాత్రం దెబ్బ తింది. అందుకే ఆత్మహత్యకు ముందే బిదిషా భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుందన్న విషయం ఇప్పుడు వెలుగు లోకి రావటం తో ఆమె భర్త ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిగా మారే అవకాశం ఉంది. ఆమె తండ్రి అశ్విని బెజ్బరువా ఇటీవల ముంబై వెళ్లిన నిషీత్‌ వేర్వేరు కారణాలు చెప్తూ గత పన్నెండు రోజులుగా గురుగావ్‌ రావడానికి నిరాకరించడంతో కలత చెందిన బిదిషా బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తండ్రి అశ్విని బెజ్బరువా తెలిపారు. నితీష్ కు మరో స్త్రీతో సంబందం ఉండటం వల్లే అతను ముంబై లో ఎక్కువకాలం ఉంటూ బిదిశా ని నిర్లక్ష్యం చేసాడన్న ఆరోపణ కూడా ఉంది. నితీష్ రెండో సంబందం ఈ కారణం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందా అన్నకోణం లో ఇప్పుడు విచారణ సాగుతోంది. కొన్నాళ్ల కిందట ముంబై నుంచి గురుగావ్‌కు ఈ దంపతులు తమ ఉద్యోగాలను బదిలీ చేసుకున్నారు. అయినా నితీష్ రెండో సంబందం విషయం లో వారు ఇంకా గొడవపడుతూనే ఉన్నారని సమాచారం. ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు బిదిషాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడనే కారణంతో ఆమె భర్త నిషీత్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిరిస్తున్నారు కూడా. బిదిషా ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు విడాకులు ఏర్పాటుచేయమంటూ వాట్సాప్‌లో తనకు మెసేజ్‌ పంపిందని ఆమె తండ్రి చెప్పాడు. నమ్మకం కోల్పోయింది 'తన వివాహం చివరి మలుపుకు చేరిందని బిదిషా చెప్పింది. ఆమెను ఒప్పించడానికి నేను ప్రయత్నించాను. వైవాహిక బంధాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించమని చెప్పాను. కానీ నిషీత్‌ పట్ల ఆమె తన నమ్మకం కోల్పోయిందని చెప్పింది' అని మీడియాతో చెప్పారు. .

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov