http://www.propellerads.com/?rfd=TwUb

info

Wednesday, 19 July 2017

On 20:04 by Unknown   No comments
మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ లో నాని..!వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని నిన్ను కోరితో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నేచురల్ స్టార్ గా ఆకట్టుకుంటున్న నాని, మాస్ హీరోయిజం జోలికి పోకుండా ఆసక్తికరమైన కథలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే మల్టీప్లెక్స్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు అన్ని వర్గాలను అలరించే పనిలో ఉన్నాడు. అందుకే మల్టీ స్టారర్ సినిమాలకు ఓటేస్తున్నాడు. రైడ్, ఎవడే సుబ్రమణ్యం, నిన్నుకోరి సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించినా.. సీనియర్ హీరోతో మాత్రం ఇంత వరకు మల్టీ స్టారర్ సినిమా చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా.. నాగ్ నుంచి గాని, నాని నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం నాని చేతులో మూడు సినిమాలు ఉన్నాయి. నాగ్ కూడా సెట్స్ మీద ఉన్న రాజుగారి గదిలో పాటు మరో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయితేగాని ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

0 comments:

Post a Comment

Flipkart App Install

http://affiliate.flipkart.com/install-app?affid=svteammov